Education | పిల్లల భవిష్యత్తుకు ప్రాథమిక విద్య చాలా కీలకo…

Education | పిల్లల భవిష్యత్తుకు ప్రాథమిక విద్య చాలా కీలకo…
- జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్.
Education | మర్రిగూడ, ఆంధ్రప్రభ : పిల్లల భవిష్యత్తుకు ప్రాథమిక విద్య ఎంతో కీలకమని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఎప్పటికప్పుడు అందేలా చర్యలు తీసుకోవాలని అంగన్వాడి సిబ్బందికి జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. సోమవారం మండలంలోని సరంపేట గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అంగన్వాడి స్కూలును సందర్శించి పిల్లలతో మాట్లాడి చదువు, పౌష్టికాహారం వివరాలు అడిగి తెలుసుకొని, అక్షరాలు, సంఖ్యలు చెప్పిస్తూ ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో అమలవుతున్న విద్యా కార్యక్రమాలు, పోషణాహార వివరాలు, హాజరు పరిస్థితి తదితర అంశాలపై అక్కడ ఉన్న అంగన్వాడి ఆయాలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఏం తిన్నారు? ఏం పెట్టారు? అని అడిగారు. దానికి పిల్లలు సమాధానం చెప్తూ పప్పు పెట్టారు అని తెలిపారు. పిల్లలకు ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అని బోధించి 1 నుండి 20 వరకు అంకెలను అడిగారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నక్క రాములమ్మ రవి, తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాస్, ఎంపీడీవో జిసి.మున్నయ్య, సిపిడిఓ సక్కుబాయి, మర్రిగూడ ఎంపీఓ రవికుమార్ ఉన్నారు.
