మా పిల్లలకు చదువు చెప్పండి

మా పిల్లలకు చదువు చెప్పండి
నర్సంపేట, ఆంధ్రప్రభ : మా పిల్లలకు చదువు చెప్పాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీమ్(Best Available Scheme) నిధులు రెండేళ్ల నుండి ఇవ్వడం లేదని విద్యార్థులకు చదువు చెప్పలేమంటూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యా లు తెగేసి చెప్పాయి. దీంతో ఈ రోజు నర్సంపేట్(Narsampet) మండలం లక్నెపల్లిలోని గురుకుల పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో చేపట్టారు.
దీంతో కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచి, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ప్రతి పాఠశాలలో 15 మందికి ఉచితంగా విద్యా బోధన చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత రెండేళ్ల నుండి ఈ స్కీం కింద నిధులు రాకపోవడంతో ప్రైవేటు యాజమాన్యాలు చదువు చెప్పలేమంటూ విద్యార్థులను స్కూలుకు రాకుండా అడ్డుకున్నాయి.
దీంతో కోపోద్రక్తులైన విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి(Baithainchi) నిరసన వ్యక్తం చేశారు. అయినప్ప టికీ నిధులు వచ్చేవరకు విద్యార్థులను తీసుకునేది లేదని ప్రైవేటు పాఠశాల(Private School)ల యాజమాన్యా లు పాఠశాలల గేట్లను మూసివేశారు. ఈ బెస్ట్ అవైలబుల్ స్కీం కింద నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా సుమారు 400 మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నట్లు తెలిసింది. ఈ విషయంలో నర్సంపేట ఎంఈఓ కొర్ర సారయ్య(MEO Korra Saraiah)ను ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు.
