Edapally | రథం చెరువులో చేప పిల్లల విడుదల

Edapally | రథం చెరువులో చేప పిల్లల విడుదల

Edapally | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారు ప్రాంతంలో గల రథం చెరువులో ఇవాళ‌ సర్పంచ్ అనురాధ కిషన్ గౌడ్, ఉపసర్పంచ్ నీలం కృష్ణ, పంచాయతీ కార్యదర్శి సందీప్, మత్స్య శాఖ అధికారులు, మత్స్య సహకార సంఘం సభ్యులతో కలిసి చెరువులో చేప పిల్లలను వదిలారు. అనంతరం సర్పంచ్, ఉపసర్పంచ్, మత్స్య సహకార సంఘం సభ్యులు దుబాక గంగాధర్ లు మాట్లాడుతూ… మత్స్యకార సంఘాలు లాభాల బాటలో పయనించేందుకు గాను సంఘం సభ్యులు పాటుపడాలని, అప్పుడే గంగపుత్రులు ఆర్థికంగా ఎదిగేందుకు ఆస్కారం కలుగుతుందన్నారు.

Edapally

రథం చెరువులో వందశాతం సబ్సిడీపై మొత్తం 25,800 చేప పిల్లలను వదలడం జరిగిందని తెలిపారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా చెరువులో చేప పిల్లలను వదలడం శుభసూచికంగా భావిస్తున్నట్లు తెలిపారు. అయితే మత్స్యకార సంఘాలకు అందించే చేప పిల్లల మొత్తం కౌంట్ కచ్చితంగా ఉండేలా మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, అప్పుడే గంగ పుత్రులకు లబ్ధి చేకూరుతుందన్నారు.

చెరువుల్లో చేపలు ఆరోగ్యంగా పెరిగేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను అటు మత్స్యకారులు, ఇటు అధికారులు తూచా తప్పకుండా పాటించాలని, అప్పుడే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం పూర్తవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య అభివృద్ధి డివిజనల్ అధికారి లయక్ మోహియుద్దీన్, ఫీల్డ్ అసిస్టెంట్ నరేందర్, మత్స్యకారులు విజయ్, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply