Eccles Poor | ఆశీర్వదించి అవకాశం ఇవ్వండి..

Eccles Poor | ఆశీర్వదించి అవకాశం ఇవ్వండి..

  • అభివృద్ధి చేసి చూపిస్తా
  • ప్రతి ఇంటి ఆడబిడ్డలకు అందుబాటులో ఉంటా…
  • ఈ నోట విన్నా.. లతా సదానందం గెలుపు మాట

Eccles Poor | మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామ సర్పంచ్ బరిలో చెన్నవేన లత సదానందం బరిలో ఉన్నారు. గ్రామంలో ఏ నూట విన్నా.. లతా సదానందం గెలుపు మాట వినిపిస్తుంది. ఒక్కసారి అవకాశం కల్పించండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటాన‌ని ఆమె అన్నారు. గెలిపిస్తే ఊరి అభివృద్ధికి కట్టుబడి ఉంటాన‌ని ఆమె తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు అండతో ఏక్లాస్ పూర్ గ్రామాన్ని మంథని మండలంలోని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని ఆమె హామీ ఇస్తున్నారు. గ్రామంలోని నిరుపేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముందు ఉంటాన‌ని ఆమె తెలిపారు.

గతంలో చెన్నవేన సదానందం సర్పంచ్‌గా చేసిన సమయంలో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పింఛన్లు మంజూరు చేయించారు. నిరుపేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశారు. మరోసారి ఎన్నికల్లో అవకాశం కల్పించాలని, ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఆయన సతీమణి లత తరపున సదానందం వివరించారు. ప్రజలే లతమ్మ తరఫున ప్రచారం చేస్తూ విజయం ఖాయమని విశ్వసిస్తున్నారు. స్థానిక సమస్యల పైన అవగాహన ఉండడం కలిసొచ్చే అంశం. ఖచ్చితంగా ఆమె విజయం సాధించడం ఖాయమని ప్రజలంతా విశ్వసిస్తున్నారు.

Leave a Reply