ప్రయోగాల బోధనతో విద్యార్థులకు సులభ అవగాహన: రాజేశ్వర్‌రావు

దండేపల్లి, ఆంధ్రప్రభ: ప్రయోగాల ద్వారా బోధిస్తే విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయని దండేపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సంఘర్స్ రాజేశ్వర్‌రావు అన్నారు.బుధవారం దండేపల్లి మండలంలోని తాళ్లపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జన్నారం, లక్షెట్టిపేట, దండేపల్లి మూడు మండలాలకు చెందిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలకు ప్రయోగాల ద్వారా బోధిస్తే పాఠ్యాంశం కళ్లకు కట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుందని ట్రైనింగ్‌కు హాజరైన ఉపాధ్యాయులకు సూచించారు.

ప్రయోగాల ద్వారా నేర్చుకున్న విషయాలను విద్యార్థులు త్వరగా గ్రహించడంతో పాటు, దీర్ఘకాలం గుర్తుంచుకుంటారని తెలిపారు.అనంతరం, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పదవీ విరమణ పొందనున్న తాళ్లపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సుదర్శన్‌ను ఫిజికల్ సైన్స్ కాంప్లెక్స్ బృందం ఘనంగా సన్మానించింది.ఈ కార్యక్రమంలో తాళ్లపేట హెచ్‌ఎం సుదర్శన్, ఉపాధ్యాయులు అప్పల మనోహర్, పాత రమేష్, సీఆర్‌పీ నర్సయ్య, కాంప్లెక్స్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply