- రామగుండం పరిసర ప్రాంతాల్లో ఉంటుందని అంచనా
- భయాందోళనలో ప్రజలు
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణకు భూకంప హెచ్చరిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈనెల 10వ తేదీ నుండి 17వ తేదీ లోపు రామగుండం పరిసర ప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. భూకంప తీవ్రత హైదరాబాద్, వరంగల్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి, మహారాష్ట్ర వరకు కూడా ఉంటుందని అంటున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.