Earthquake | తీవ్రత 3.5గా నమోదు..

Earthquake | తీవ్రత 3.5గా నమోదు..

Earthquake | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో భూప్రకంపనలు భయాందోళనలు సృష్టించాయి. రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ఇవాళ ఉద‌యం భూకంపం సంభవించింది. భూకంప తీవ్ర‌త‌ రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నిర్ధారించింది. వినుకొండకు 20కిలోమీటర్ల దూరంలో భూఉపరితలానికి 10కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించింది.

తెల్లవారుజామున 2:33 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. ఈ భూకంప ప్రభావంతో పల్నాడు జిల్లాలోని వినుకొండతో పాటు దర్శి, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్ర‌జ‌లు భయాందోళనలకు గురయ్యారు.

Leave a Reply