న్యూ ఢిల్లీ : రాజధాని ఢిల్లీ తో సహా ఉత్తరాది లోని పలు రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గురువారం ఉదయం 9.4 గంటల ప్రాంతంలో ప్రకంపనలు జరిగాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం..రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.4గా నమోదైంది. నిమిషం పాటు భూమి కంపించింది.
హర్యానా రోహతక్ దగ్గర భూకంప కేంద్రం గుర్తించారు. గురుగ్రామ్‌లో భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా వివరాలు తెలియలేదు.
హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ప్రకంపలు చోటుచేసుకున్నాయి. ఇంట్లో ఫ్యాన్లు, ఇతర గృహోపకరణాలు ఊగిపోవడంతో నివాసితులు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. నోయిడా, గురుగ్రామ్‌లోని కార్యాలయాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. కంప్యూటర్లు కదిలాయి. ఉద్యోగులంతా కార్యాలయాల నుంచి బయటకు వచ్చేశారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, షామ్లీ వరకు ప్రకంపనలు సంభవించాయి. ఝజ్జర్‌లోని భూకంప కేంద్రం నుంచి 200 కి.మీ దూరం వరకు సంభవించింది.