- కీలక ప్రసంగం చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా..
- పాల్గొన్న కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురాం..
ఆంధ్రప్రభ, విజయవాడ: అహ్మదాబాద్లో జరిగిన ఎర్త్ సమ్మిట్–2025లో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఇతర డిసిసిబి చైర్మన్లతో కలిసి మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సహకార, హోం వ్యవహారాల శాఖ మంత్రి అమిత్ షా, గ్రామీణ సహకార రంగ అభివృద్ధిపై మాట్లాడారు.
అహ్మదాబాద్–గాంధీనగర్లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఐఏఎఎమ్ఏఐ, నాబార్డ్ సంయుక్తంగా నిర్వహించిన ఎంపౌరింగ్ అగ్రికల్చర్, రూరల్ టెక్నాలజీ అండ్ హ్యుమానిటీ అనే జాతీయ స్థాయి ఎర్త్ సమ్మిట్లో నెట్టెం రఘురాం పాల్గొన్నారు.
సమ్మిట్ సందర్భంగా ఎన్సియూఐ–ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘాని, నాబార్డ్ చైర్మన్ షాజీ కె.వి.తో నెట్టెం రఘురాం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కోఆపరేటివ్ బ్యాంకింగ్ భవిష్యత్తు, రైతు సాధికారత, కొత్త రూరల్ టెక్నాలజీ విధానాలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పలు జిల్లాల చైర్మన్లు, ఆప్కాబ్ అధికారులు కూడా పాల్గొన్నారు.

