Durgi | గుర్తు తెలియని వాహనం ఢీ..

Durgi | గుర్తు తెలియని వాహనం ఢీ..
- ఒకరి మృతి. మరొకరికి గాయాలు
Durgi | దుర్గి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని కోలగుట్ల గ్రామ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ముటుకూరు గ్రామానికి చెందిన గొట్టిపాటి రవీంద్ర (25), ఆతని మామ మండ్లి బై స్వామి ద్విచక్ర వాహనం పై అనుపాలెం గ్రామానికి వ్యక్తి గత పనులపై వెళ్లి తిరిగి వస్తుండగా శుక్రవారం దుర్గి మండలం కొలగుట్ల గ్రామ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో రవీంద్ర మృతి చెందగా, బైస్వామికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదే హాన్ని, గాయాలపాలైన వ్యక్తిని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

