Dumping yard | డంపింగ్ యార్డును తొల‌గించాలి…

Dumping yard | డంపింగ్ యార్డును తొల‌గించాలి…

Dumping yard | చిట్యాల, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెంలో నిర్వహిస్తున్న డంపింగ్ యార్డ్(Dumping yard)ను తక్షణమే వేరే చోటికి మార్చాలని ఆ వార్డుకు ప్రజలు ఈ రోజు మున్సిపల్ కార్యాలయం ముందు చెత్త పోసి ఆందోళన చేశారు. ప్రజలు మాట్లాడుతూ… ఎన్నో రోజులుగా శివనేనిగూడెంలో నిర్వహిస్తున్న డంపింగ్ యార్డ్ వల్ల వచ్చే దుర్వాసన, కలుషితమైన పోగా, బూడిద, ఇతర కాలుష్యకారక వస్తువుల ప్రజలు నివాసం ఉండలేని పరిస్థితి ఉందని వృద్ధులు, చిన్న పిల్లలు శ్వాసకోశ వ్యాధుల(respiratory diseases)కు గురై ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

డంపింగ్ యార్డ్ ను అక్కడి నుండి తొలగించాలని జిల్లా కలెక్టర్, ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్, త‌హ‌శిల్దార్ లకు వినతి పత్రం అందించినప్పటికీ వారెవరు స్పందించడం లేదని ఆరోపించారు. డంపింగ్ యార్డ్ ను వెంటనే అక్కడి నుండి తీసివేయకపోతే అక్కడ ఉన్న చెత్త మొత్తం మున్సిపల్ కార్యాలయం(municipal office) ముందు పోసి తగలబెడతామని వారు హెచ్చరించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను మాట్లాడుతూ… ఈ విషయాన్ని నల్గొండ ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని రెండు మూడు రోజుల్లో ఆయన డంపింగ్ యార్డ్ ను పరిశీలించి పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోనున్నారని అప్పటివరకు ఓపిక పట్టాలని చెప్పడంతో వారు శాంతించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply