dull| డల్నెస్కు బైబై..యాక్టివ్గా మారండిలా..

డల్నెస్కు బైబై..యాక్టివ్గా మారండిలా..
ఆంధ్రప్రభ, వెబ్ న్యూస్ : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా ఉంటేనే ఏ పని అయిన సునాయాసంగా చేయగలుగుతాం. అంటే ప్రతీ మనిషికి హెల్త్ ముఖ్యమని గమనించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మొదటికే మోసం వస్తుంది. అయితే ప్రస్తుతం చాలామంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధ పడుతూనే ఉంటారు. కారణంగా మనం తీసుకునే ఆహారం, జీవన తీరు అని చెప్పవచ్చు. అయితే తింటే ఒకతీరు.. తినకపోతే మరొకతీరుగా ఉంటుంది. అయితే కొందరికి తిన్నా, తినకపోయినా నీరసంగా ఉంటున్న వారి సంఖ్య, ఎప్పుడు చూసినా చురుకుగా లేకుండా, అశక్తులుగా కనిపిస్తుంటారు. అలా ఎందుకు నీరసంగా ఉంటుంది? అసలు నీరసానికి గల ముఖ్య కారణాలు ఏమిటి? నీరసం తగ్గాలంటే ఏం చెయ్యాలి ..? ఇప్పుడు మీకు అందిస్తోంది ఆంద్రప్రభ ప్రత్యేక కథనం..

- నీరసంగా ఉండటం వెనుక ప్రధాన కారణం ఎక్కువగా నీళ్లు తాగకపోవడం.
- ప్రతీ రోజు నాలుగు నుండి ఐదు లీటర్ల నీళ్లు తాగాలి అని వైద్యులు సూచిస్తున్నారు.
- ఉదయం ఏమీ ఆహారం తీసుకోకపోతే రోజంతా నీరసంగా ఉంటుంది.
- చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడంతో నీరసం ఉంటుంది.
- మధ్యాహ్నం భోజనం చేయడం కన్నా ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం చాలా ముఖ్యం.
- ఉదయం బ్రేక్ ఫాస్ట్ తోనే ఉత్సాహంగా ఆరోజు పనిలో ముందుకు వెళ్తాం.
- ఐరన్ లోపం ఉన్న వారిలో నీరసంగా ఉంటుంది.
- ఆకుపచ్చని కూరగాయలను, ఆకు కూరలను తింటే ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.
- జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.
- ఉదయం లేదా వ్యాయామానికి ముందు అరటిపండు తింటే అలసట త్వరగా తగ్గుతుంది.
- తక్షణ శక్తి కావాలంటే ఖర్జూరం బెస్ట్. ఇందులో గ్లూకోజ్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి.
- 2-3 ఖర్జూరాలు తింటే శరీరం యాక్టివ్గా మారుతుంది.
- గుడ్లు ప్రోటీన్కు మంచి వనరు. ఇవి కండరాలను బలంగా చేసి రోజంతా శక్తిని నిలబెట్టడంలో సాయపడతాయి.
- ఉదయం గుడ్డు తింటే అలసట తగ్గుతుంది.
- బాదం, వాల్నట్, జీడిపప్పు లాంటివి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
- రోజూ ఉదయం 4-5 నానబెట్టిన బాదం తింటే ఉత్సాహం పెరుగుతుంది.
- పెరుగులో ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచి శరీరానికి శక్తిని అందిస్తాయి.
- నెమ్మదిగా శక్తిని విడుదల చేసే ఆహారం ఓట్స్. ఉదయం అల్పాహారంగా తింటే ఎక్కువసేపు యాక్టివ్గా ఉంటారు.

ఇలా కూడా చేయండి..
- ప్రతిరోజూ కనీసం 7–8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం.
- నిద్రలేమి చిరాకు, నీరసానికి దారితీస్తుంది.
- ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది.
- నడవడం, యోగా, డ్యాన్స్ లేదా ఇష్టమైన ఏదైనా శారీరక శ్రమ చేయవచ్చు.
- ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం లేదా రిలాక్సేషన్ టెక్నిక్స్ కోసం కేటాయించండి.
- పాజిటివ్ ఆలోచనలు.. ప్రతికూల ఆలోచనలను తగ్గించుకుని సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోండి.

