DRDO | బాలిస్టిక్ క్షిపణులు పృథ్వీ 2, అగ్ని1ల టెస్ట్ ఫైర్ స‌క్సెస్…

న్యూఢిల్లీ: స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు (Ballistic Missiles ) పృథ్వీ 2 (Pridhvi ) , అగ్ని 1 (Pridhvi ) ల పరీక్ష (test ) విజయవంతం అయింది. ఒడిశా, చాందీపూర్‌లోని (chandipur ) ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి గ‌త రాత్రి వాటిని పరీక్షించారు. ది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో వాటి పరీక్ష జరిగింది. పృథ్వీ 2, అగ్ని 1లు ఆపరేషనల్, టెక్నికల్ పారామీటర్స్‌ను అందుకున్నాయ‌ని . దీంతో పరీక్ష విజయవంతం అయింద‌ని అధికారులు నేడు ప్ర‌క‌టించారు.

పృథ్వీ 2 మిస్సైల్ ప్రత్యేకతలు

ఇది స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. దీనిని భారతదేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి. ది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ దీనిని వాడుతుంది. ఈ క్షిపణి రేంజ్ 350 కిలోమీటర్లు. 500 నుంచి 1000 కిలోల బరువును మోసుకెళ్లగలదు.

అగ్ని 1 మిస్సైల్ ప్రత్యేకతలు

ఇది స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. దీనిని భారతదేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన‌ ఈ క్షిపణి రేంజ్ 700 నుంచి 900 కిలోమీటర్లు. ఇది వెయ్యి కిలోల యుద్ధ సామాగ్రిని మోసుకెళ్లగలదు. తక్కువ లోడు ఉంటే ఏకంగా 1200 కిలోమీటర్లు దూసుకెళ్లగలదు.

Leave a Reply