ఆఫీసులకు వెళ్ళేటప్పుడు, ఆఫీసుల నుండి ఇళ్ళకు వచ్చేటప్పుడు వర్షాలు (rains) సడెన్ గా దాడి చేస్తున్నాయి. దానివల్ల తడవకుండా గమ్యం చేరుకోవడం కష్టమే. కొద్దిగా తడిచినా, వెంటనే జలుబు (cold) పట్టేస్తుంది. జలుబు రావడానికి ఎక్కువ సమయం అక్కర్లేదు గానీ, తగ్గడానికి మాత్రం చాలా టైం తీసుకుంటుంది. అంత తేలికగా వదలదు. జలుబు రాకుండా, లేదా త్వరగా వదిలేందుకు కొన్ని జాగ్రత్తలు, చిట్కాలు పాటిస్తే త్వరగా ఉపశమనం పొందొచ్చు.

చేతులు (hands) శుభ్రంగా ఉంచుకోవాలి, ఏ తిండి పదార్థాన్ని వస్తువులను తాకినా అదే చేత్తో ముక్కు తుడుచుకోవడం వల్ల జలుబు తీవ్రత అధికమవుతుంది. గుంపులలో, లేదా దుమ్ము, ధూళి వాతావరణం, లేదా ఏసీ (AC) లో ఉండడం వల్ల కూడా జలుబు తీవ్రమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మామూలు నీళ్ళు, చల్లటి నీళ్ళ కంటే, గోరు వెచ్చని నీళ్లు తాగడం మంచిది. జలుబు వల్ల ఏర్పడిన గొంతు గరగర, చిరాకు కాస్త ఉపశమిస్తుంది.

ఏసీలో, లేదా చల్లని వాతావరణంలో తప్పనిసరిగా ఉండవలసి వస్తే మాస్క్ (Mask) వాడడం మంచిది. దానివల్ల దగ్గు, తుమ్ము సమయంలో మనద్వారా జలుబు (cold) వ్యాప్తి తగ్గుతుంది. మనకు కూడా ఆల్రెడీ ఉన్న జలుబుకి తోడు బయటి నుంచి వచ్చి నేరుగా ముక్కుపుటాల్లోకి వెళ్ళే గాలి తీవ్రత చిరాకు కలిగిస్తుంది. మనం ఉండే పరిసరాల్లో గాలి బాగా వచ్చేలా ఉండాలి. తలుపులు, కిటికీలు మూసేసీ, ఫ్యాన్లు ఆఫ్ చేసి ఉండొద్దు.

జ్వరం వచ్చినప్పటి లాగా నోరు చేదుగా ఉండకపోయినా, ఏదీ తినాలనిపించక, ఏది చూసినా వెగటుగా అనిపిస్తుంది జలుబు వల్ల. అందుకని, వేపుళ్ళు, జంక్ ఫుడ్ (Junk food) లాంటి వాటి జోలికి అస్సలు పోవద్దు. చక్కటి ఆరోగ్యకరమైన ఆహారం (Healthy food) మాత్రమే తీసుకోవాలి. ఉదాహరణకు విటమిన్ సి (Vitamin C) (నారింజ, ఉసిరి), ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. అన్నిటికన్న ముఖ్యమైనది, శరీరానికి తగినంత విశ్రాంతినివ్వాలి. అప్పుడే శరీరం వైరస్‌తో పోరాడటానికి శక్తి పొందుతుంది. అప్పుడప్పుడు వేడి ఆవిరి పీల్చడం ఉపశమనం కలిగిస్తుంది. వేడి నీటిలో కాస్త ఉప్పు వేసి గొంతులో దాకా పోనిచ్చి బయటికి వదిలేయాలి. దాని ద్వారా జలుబు వల్ల గొంతులో కలిగే అనీజీనెస్ తగ్గుతుంది.

చల్లటి పదార్థాలు, ఐస్ క్రీమ్, గ్యాస్ డ్రింక్స్ జోలికి అస్సలు పోవద్దు
త్వరగా జలుబు తగ్గాలని చాలామంది చేసే పెద్ద పొరపాటు, యాంటి బయాటిక్స్ (Antibiotics) వాడడం. దాని ద్వారా తాత్కాలిక ఉపశమనం కలిగించినా, తరచుగా యాంటి బయాటిక్స్ వాడడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో చెప్పలేం. అందువల్ల డాక్టర్ సలహా (Doctor’s advice) లేకుండా యాంటీబయోటిక్స్ వాడకూడదు.

Leave a Reply