అమరావతి : గ్రూప్ రాజకీయాలకు తావివ్వొద్దని నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు.
నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. “తెదేపా నాయకులు ఏ స్థాయిలోనూ వైకాపా నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదు. నేను ఇలా చెబితే.. వైకాపాకు ఓటేసిన వారికి పథకాలు ఇవ్వొద్దన్నట్లు ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదు. పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నాం. సంక్షేమ పథకాలు వేరు.. రాజకీయ సంబంధాలు వేరు” అని చంద్రబాబు తెలిపారు.