పాఠశాల అభివృద్ధికి రూ.10,000 విరాళం

బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలోని చిలాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కై కీర్తిశేషులు కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి జ్ఞాపకార్థం వారి సతీమణి కొమ్మెర సులోచన రూ.10,000 నగదును ఎంఈఓ మహతి లక్ష్మి సమక్షంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు రామంచ రవీందర్ లకు కొమ్మెర రామకృష్ణారెడ్డి మరియు పవ్వాడి మల్లికార్జున విరాళంగా అందజేశారు. పాఠశాల అభివృద్ధి కోసం ఈ విరాళాన్ని వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply