అయ్యప్ప స్వామి అన్నసేవ మండప నిర్మాణానికి రూ. లక్ష విరాళం

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం చెమ్మనగిరిపేటలోని శివాలయంలో కొలువై ఉన్న బంగారు అయ్యప్ప స్వామి దేవస్థానం తరఫున, శివాలయం వెనుకవైపున శ్రీ అయ్యప్ప స్వామి అన్నసేవ మండప నిర్మాణానికి ఆదివారం వేదమంత్రాల మధ్య ఘనంగా శంకుస్థాపన జరిగింది.

ఈ కార్యక్రమం శ్రీ అయ్యప్ప స్వామి అన్నసేవ ట్రస్ట్ సభ్యులు దేశు సత్య వెంకట రాంబాబు, దేశు సత్య వెంకట రమణమూర్తి, కొత్తగుండు శివప్రసాద్, నగరపు మల్లేశ్వరరావు, జొన్నలగడ్డ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఆలయ పూర్వ అర్చకులు మురళి స్వామి నేతృత్వంలో శాస్త్రోక్తంగా కార్యక్రమం జరిగింది.

మండప నిర్మాణం కోసం మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మరియు 15వ డివిజన్ మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజ దంపతులు సేవా ట్రస్టుకు రూ.1 లక్ష నగదు విరాళంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, మాదిరెడ్డి అంజిబాబు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అయ్యప్ప దీక్షను పురస్కరించుకుని వచ్చే సంవత్సరం లక్షమంది దీక్షాదారులకు అన్నప్రసాదం అందించేందుకు అన్నసేవ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply