KNL | బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరికో ప్రాణదానం : టీజీ వెంకటేష్

కర్నూలు బ్యూరో : కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరో ప్రాణాపాయం నుంచి కోలుకున్నారని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. టీజీ వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గ్రూపు రాజకీయాల వల్ల అభివృద్ధి బాగా కుంటుపడేదన్నారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తేవడం వల్ల పనులు సక్రమంగా జరిగేవి కావన్నారు. ఎంతో మంది రోగులకు ఉపయోగపడే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కోసం స్థల సేకరణకు ఎంతగానో అడ్డుకున్నారని, ఈరోజు అదే బెడ్ బ్యాంకు వల్ల సంవత్సరానికి పదివేల యూనిట్ల బ్ల‌డ్ ఇవ్వగలుగుతున్నామన్నారు.

దీని ద్వారా ఎంతో మంది రోగులకు ప్రాణాపాయం తప్పుతుందన్నారు. అలాగే పంచలింగాల వద్ద రైల్వే ప్రాజెక్టును అప్పటి కేంద్ర రైల్వే సహాయక‌ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సహకారంతో తీసుకురావడం జరిగిందని, దానిని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించారన్నారు. అది ఇప్పుడు త్వరలోనే ప్రారంభం కానుందని టీజీ తెలిపారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరిలో రక్తదానంపై మంచి అవగాహన కలిగిందన్నారు. అప్పటి కంటే ముందే కర్నూల్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత కర్నూలు రెడ్ క్రాస్ సొసైటీకి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, కేజీ గోవింద్ రెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, శ్రీనివాస్, ఎస్కే మహేష్, తదితరులు పాల్గొన్నారు.

క్రీడా సేవలు మరుపురానివి
మాజీ ఎంపీ టీజీకి క్రీడా సంఘాల కితాబు
కర్నూలు బ్యూరో : క్రీడాదాత మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ క్రీడారంగానికి చేసిన సేవలు మరుపురానివని జిల్లా క్రీడా సంఘ ప్రతినిధులు కొనియాడారు. శుక్రవారం టీజీ వెంకటేష్ తన నివాసంలో కలిసి క్రీడా సంఘ నేతలు పూలమొక్కను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అథ్లెటిక్స్, రగ్బీ, హ్యాండ్ బాల్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ, రైఫిల్ షూటింగ్, పవర్ లిఫ్టింగ్, శిలంబం, ఫుట్ బాల్, మాస్టర్ అథ్లెటిక్స్, సాఫ్ట్ టెన్నిస్, జిమ్నాస్టిక్స్, టెన్నిస్, సైకిల్ పోలో, కరాటే, టైక్వాండో, సాఫ్ట్ బాల్, స్క్వే మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్, రెజ్లింగ్, షూటింగ్ బాల్ తదితర క్రీడాంశాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొని కరచాలనంతో శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, సురేంద్ర, హర్షవర్ధన్ సుధీర్, సీనియర్ క్రీడాకారులతో పాటు జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply