రక్తదానం.. ప్రాణదానమే..

  • 70 మంది విద్యార్థుల రక్తదానం

నంద్యాల బ్యూరో ఆంధ్రప్రభ : రక్తదానం చేయటం అంటే ఇంకొకరికి ప్రాణదానం చేయడంతో సమానమైన దని శ్రీరామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల కళాశాలలో చైర్మన్ రామకృష్ణారెడ్డి,అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిర కార్యక్రమాన్ని నిర్వహించారు.

రక్తదాన శిబిరం లో పాగొన్న 70 మంది విద్యార్థులను ఆయన ప్రశంసించారు. ఇప్పుడే కాకుండా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో కలశాల విద్యార్థులు పలు పంచుకుని ఒక మంచి సమాజముకై పాటు పడాలని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ విజయ్, అధ్యాపకులు ఇంతియాజ్ అహ్మద్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply