Stock markets | న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) ఇవాళ‌ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల (International markets) లో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. అమెరికా-భారత్ వాణిజ్య చర్చల ఫలితం కోసం మదుపర్లు ఎదురుచూస్తున్నారు. విదేశీ నిధులు (Foreign funds) మన స్టాక్ మార్కెట్ నుంచి తరలిపోవడం కూడా సూచీలపై ప్రభావం చూపింది. దాంతో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 168 పాయింట్ల నష్టంతో 82,090 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు క్షీణించి 25,075 వద్ద ఉంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.99 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో టాటా స్టీల్, హీరో మోటార్కార్ప్, కోల్ ఇండియా, ఓఎన్జీ సీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. యాక్సిక్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, కొటక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టెక్ మహీంద్రా స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.

Leave a Reply