నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ

నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ

ఉద్యోగావకాశాలకు చక్కటి అవకాశం..
తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 3 నెలల కోర్సు ప్రారంభం…
10వ తరగతి పైగా అర్హత…
35 ఏళ్ల లోపు వారికి కల్పిస్తున్న అవకాశం

తిరువూరు, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ శిక్షణ కోర్సులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమం స్కిల్ ఇండియా పథకం కింద అమలు చేయబడుతూ, యువతను ఉద్యోగాలకు సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇందులో భాగంగా డొమెస్టిక్ బయోమెట్రిక్ డేటా ఆపరేటర్ కోర్సును అందిస్తున్నారు. ఈ కోర్సు వ్యవధి 3 నెలలు కాగా, 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 35 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు అర్హులుగా నిర్ణయించారు. శిక్షణ పూర్తిగా నాన్-రెసిడెన్షియల్ విధానంలో నిర్వహిస్తున్నడగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు, శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాల కల్పనకు కూడా సహాయం అందిస్తారు.

ఈ కోర్సుకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుండి ధ్రువపత్రాలు అందజేయనున్నారు. ఆసక్తి ఉన్నా అభ్యర్థులు దరఖాస్తుదారులు తమ విద్యా సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఫోటోలు సమర్పించాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 8, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం 9700092606 నంబర్‌లో సంప్రదించవచ్చుని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాల్ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం పొందవచ్చుని అధికారులు పేర్కొన్నారు.

సద్వినియోగం చేసుకోండి…

ఉద్యగ, ఉపాధి అవకాశాల కోసం ఎంతో ఉపయోగపడే నైపుణ్య శిక్షణను నిరుద్యోగ యువత యువకులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుత రోజులకు అనుగుణంగా అవకాశాలను అంది పుచ్చుకునే విధంగా పూర్తిస్థాయిలో నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. నియోజకవర్గంలో ఉన్న యువతకు ఇదో చక్కటి అవకాశం.

Leave a Reply