DK ARUNA | ఆదరించి గెలిపిస్తే ఎంపీ నిధులు తీసుకోచ్చిఅభివృద్ధిచేస్తా…

DK ARUNA | ఆదరించి గెలిపిస్తే ఎంపీ నిధులు తీసుకోచ్చిఅభివృద్ధిచేస్తా…
DK ARUNA | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపిస్తే ఎంపీ డీకే అరుణ సహకారంతో నిధులు తీసుకువచ్చి చూపిస్తానని పెద్దజట్రం బీజేపీ సర్పంచ్ అభ్యర్థి వాకిటి వెంకటేష్ అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్ద జట్రంలో వార్డు అభ్యర్థులు బిజెపి ఇంటింటి ప్రచారం చేపట్టగా ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిస్వార్ధంగా ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని ప్రతి ఒక్కరు ఆదరించి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు మంజూరు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు మంజూరు చేసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అభివృద్ధికి నిధులు మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. నీతి నిజాయితీతో కూడిన పారదర్శకమైన పాలన అందించడమే తన లక్ష్యమన్నారు. ప్రతి వాడలో డ్రైనేజీ సిసి రోడ్లు వేయడంతోపాటు విద్య వైద్య రంగాలకు ప్రత్యేక కృషి చేస్తానన్నారు. ప్రజల కోరిక మేరకు సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలిచానని అందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతి ఒక్కరూ తనకు పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, గంగాధర్ రెడ్డి, సోమేశ్వర్ రెడ్డి, కుర్వ బండప్ప, శంకరప్ప అంజప్ప తదితరులు పాల్గొన్నారు.
