ముత్తాపూర్ వాసి మహేష్‌కు డాక్టరేట్…

ముత్తాపూర్ వాసి మహేష్‌కు డాక్టరేట్…
కన్నెపల్లి, ఆంధ్రప్రభ : కన్నెపల్లి మండలం ముత్తాపూర్ గ్రామానికి చెందిన గొల్లెన మహేష్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి వృక్షశాస్త్రంలో డాక్టరేట్ (పీహెచ్‌డీ) సాధించాడు. ప్రస్తుతం కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తున్న మహేష్, ప్రొఫెసర్ కె. శైలజ పర్యవేక్షణలో తన పరిశోధనను పూర్తి చేశాడు. “ఎకలాజి అండ్ ఆల్గాల్ డైవర్సిటి ఇన్ మిడ్ మానేరు డామ్ విత్ రిఫరెన్స్ టు వాటర్ క్వాలిటీ రాజన్న సిరిసిల్ల, తెలంగాణ” అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు గాను యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసింది.
కన్నెపల్లి మండలం నుండి పీహెచ్‌డీ సాధించిన మొదటి వ్యక్తి మహేష్ కావడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు , మిత్రులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఉన్నత చదువుల్లో రాణించి గ్రామానికి, మండలానికి పేరు తెచ్చినందుకు పలువురు హర్షం వ్యక్తం చేశారు.
