( విజయవాడ, ఆంధ్రప్రభ): విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం పాము సంచారం భక్తులకు కలవరపాటుకు గురి చేసింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో కొండపై నుంచి కిందకి వస్తున్న పాములు క్యూలైన్లలో సంచరిస్తున్నాయి. అమ్మవారి దర్శనానికి రేపళ్లె నుంచి వచ్చిన భక్తులు,ఓం టర్నింగ్ నుంచి క్యూలైన్ లో అమ్మవారి దర్శనానికి వెల్తున్న క్రమంలో భక్తుడిని పాము కాటేసింది.
వెంటనే స్పందించిన దుర్గగుడి అధికారులు, పోలీసులు హుటాహుటిన దేవస్ధానం ఆంబులెన్స్ లో ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. పాము కాటేసిన అనంతరం అరుపులు కేకలతో ఓం టర్నింగ్ వద్ద ఉన్న భక్తులు పరుగులు తీశారు. విషపూరితమైన పాము కాకపోవడంతో భక్తుడీ కీ ప్రాణాపాయం తప్పింది. రేపల్లే కు చెందిన శ్రీనివాసరావు అనే భక్తుడిని అబ్జర్వేషన్ కోసం ప్రభుత్వాసుపత్రిలో ట్రీట్ మెంట్ నిమిత్తం ఉంచిన వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.