బాల కార్మిక రహిత జిల్లాగా ములుగును తీర్చిదిద్దాలి

బాల కార్మిక రహిత జిల్లాగా ములుగును తీర్చిదిద్దాలి

జిల్లా సంక్షేమ అధికారి తుల రవి


ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు : బాల కార్మిక రహిత జిల్లాగా ములుగును తీర్చిదిద్దడమే లక్ష్యం అని జిల్లా సంక్షేమ అధికారి తుల రవి (Tula Ravi) అన్నారు. ఈ మేరకు మంగళవారం సఖి కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్ లో OFI & CFI సంస్థల ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై సమన్వయ శాఖలతో సమావేశం నిర్వహించారు.

దీనికి ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ అధికారి తుల రవి హాజరై మాట్లాడారు. బాల్యం ఎంతో అమూల్యమైనదని, అతి సున్నితమైన బాల్యానికి, వారి హక్కుల పరిరక్షణకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉన్నదని అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం అంతా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం OFI & CFI స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు.

గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీలు ప్రతీ నెలా సమావేశమ‌య్యేలా పంచాయతీ కార్యదర్శులతో తప్పకుండా సమన్వయం చేసుకోవాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యం.. కావున ప్రజలకు అవగాహన కల్పించేలా సోషల్ మీడియా వేదికలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్ వినోద డీసీపీఓ ఓంకార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply