District SP | రూల్స్‌ పాటించండి..

District SP | రూల్స్‌ పాటించండి..

  • రోడ్డు భద్రతపై అవగాహన

District SP | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు బందరు డీఎస్పీ సీహెచ్ రాజా రోడ్డు భద్రతా మాసోత్సవాలు ( శిక్షణతో భద్రత సాంకేతికత ద్వారా పరివర్తన కార్యక్రమం) సందర్భంగా బందరు డీమార్ట్ సెంటర్ వద్ద ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పించారు. మచిలీపట్నంలోని డీమార్ట్ సెంటర్ వద్ద (బ్లాక్ స్పాట్) ట్రాఫిక్ సీఐ నున్న రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో బందరు డీఎస్పీ రాజా స్వయంగా పాల్గొని వాహనదారులకు, ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ రాజా మాట్లాడుతూ బందరు పట్టణంలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో డీమార్ట్ సెంటర్ ఒకటని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాహనదారులు రోడ్డుదాటే పాదచారులను ఢీకొట్టడం వలన ప్రమాదాలు జరిగి అనేక మంది క్షతగాత్రులయ్యారని తెలిపారు. అంతేకాకుండా బందరు పట్టణ అభివృద్ధిలో భాగంగా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందని, మారుతున్న కాలానుగుణంగా వాహనదారులు ప్రజలు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, సీటు బెల్టు ధరించి డ్రైవ్ చేయాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాద‌ని తెలిపారు.

Leave a Reply