ఇంటర్ పరీక్షలు సాఫీగా జరగాలి..

ఇంటర్ పరీక్షలు సాఫీగా జరగాలి..

  • జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం నర్సాపూర్ లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని,విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. త్రాగునీరు, విద్యుత్ సరఫరా, అత్యవసర మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply