ట్రాఫిక్ రూల్స్ పాటించడం మన విధి

  • ఇక నుంచి రూల్స్ మీరితే సహించం
  • మంచిర్యాల డీ సీ పీ భాస్కర్

లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అది మన విధి అని మంచిర్యాల డీసీపీ ఎగ్గిడి భాస్కర్ అన్నారు. ఈ రోజు లక్షెట్టిపేట పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీనివాస గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమానికి డీసీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. పోలీసులు పనిచేస్తున్నది ప్రజల రక్షణ కోసమేనన్నారు.

నిత్యం మన ప్రాంతాల్లో వాహనాలపై వెళ్తున్న వారు వివిధ ప్రమాదాలకు గురై చనిపోతున్నారన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాళ్లు చనిపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ప్రమాదాలకు కారణాలు కేవలం మనం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమేననే విషయాన్నిమనం ప్రతి ఒక్కరం గుర్తుంచుకోవాలన్నారు. మనమే కాకుండా మన వాళ్లకు కూడా ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలన్నారు.

ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, పోలీసులు ప్రజల రక్షణ కోసం ప్రజల కుటుంబాల సంతోషంగా ఉండాలని ఎన్నో విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కొన్ని ప్రమాదాల్లో గాయపడ్డ వాళ్లని చనిపోయిన వాళ్ళని చూస్తే మనసు చలించిపోతుందని అలాంటి ప్రమాదాలకు నిర్లక్ష్యం మనం రూల్స్ పాటించకపోవడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రతి ఒక్క డ్రైవర్ గాని, ప్రతి ఒక్క వాహనదారుడు గాని తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. బైక్ నడిపే సమయంలో తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కారు నడిపి సమయంలో సీట్ బెల్ట్ ధరించాలని స్కూల్ పిల్లలను జాగ్రత్తగా డ్రైవర్లు తీసుకుపోవడం చేయాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, రాష్ డ్రైవింగ్ నేరంగా భావించాలని అవగాహన కల్పించారు.

అంతేకాకుండా ప్రతి ఒక్కరూ వాహన పత్రాలను సరిచూసుకోవాలని డ్రైవింగ్ లైసెన్స్ లేనిదే వాహనం నడపరాదన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని వాహనదారులతో, డ్రైవర్లతో ప్రమాణం చేయించారు. అనంతరం కొంతమందికి హెల్మెట్లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎసీపీ ప్రకాష్,సీఐ రమణమూర్తి, లక్షెట్టిపేట ఎస్సైలు గోపతి సురేష్, రామయ్య, దండేపల్లి ఎస్సై తహసియుద్దీన్, జన్నారం ఎస్సై అనూషతోపాటు పోలీస్ సిబ్బంది,రవాణా శాఖ అధికారులు,వాహనదారులు డ్రైవర్లు,విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply