గిరిజనులకు దుప్పట్లు పంపిణీ

గిరిజనులకు దుప్పట్లు పంపిణీ

దండేపల్లి, ఆంధ్రప్రభ : వార్త సేకరణలోనే కాకుండా సామాజిక సేవలోనూ ముందుంటున్నట్లు దండేపల్లి(Dandepally) పాత్రికేయులు నిరూపించారు.రానున్న చలికాలన్నీ గుర్తించి అటవీ సమీపంలో నివసించే ఆదివాసి గిరిజనుల(tribal)కు గురువారం దండేపల్లి ప్రింట్ మీడియా క్లబ్(Media Club) వార్షికోత్సవం సందర్బంగా పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు.ముందుగా కేక్ కట్ చేసి లింగాపూర్ బిల్కు గూడ గిరిజనగ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణి చేశారు.

ఈకార్యాక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి రవి గౌడ్, ఎడ్ల రాజన్న, గౌరవ అధ్యక్షుడు గోపతి శ్రీనివాస్(Gopathi Srinivas), ఉపాధ్యక్షులు బూసిరాజు రాజన్న, ప్రచార కార్యదర్శి ఎనగందుల సత్యం,సలహాదారులు గాలిపెళ్లి వెంకటపతి, బచ్చల సుభాష్, కట్ట వెంకటేష్(Katta Venkatesh
), అల్లంల కుమార స్వామి, మందల మల్లేష్, తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.

Leave a Reply