Distribution | పాస్ పుస్తకాలతో భూ భద్రత

Distribution | పాస్ పుస్తకాలతో భూ భద్రత

  • జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్

Distribution | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రభుత్వం రైతులకు పంపిణీ(distribution) చేస్తున్న పట్టాదారు పాసుపుస్తకాలు వలన భూమిపై తగు భద్రత కల్పించబడినట్లుగా జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు.

ఇవాళ‌ శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం ఉప్పలపాడు గ్రామంలో నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో పాల్గొని… ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ రైతులకు అందజేశారు.

రైతుల భూహక్కులకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. భూ రికార్డుల పారదర్శకతతో రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. పాసు పుస్తకాల(passbooks)తో రైతులకు ప్రభుత్వ పథకాలు సులభంగా అందుతాయి.

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేష్, త‌హ‌సీల్దారు, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply