Distribution | నేటి పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

Distribution | నేటి పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

  • పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది

Distribution | నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : నేరేడుచర్ల మండలంలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కు కావలసిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం లో డిస్ట్రిబ్యూషన్(Distribution) రిసెప్షన్ కేంద్రంలో పోలింగ్ సామాగ్రిని ఎన్నికల సిబ్బందికి పంపిణీ చేశారు.

మండలంలో 19 గ్రామ పంచాయతీలకు గాను మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా కాగా మిగిలిన 16 గ్రామ పంచాయతీలకు, 168 వార్డులకు గాను 49 వార్డులు ఏకగ్రీవం కాగా 119 వార్డులకు ఎన్నిక జరగనుంది. 17గ్రామపంచాయతీలలో151 పోలింగ్ కేంద్రాల(polling stations)లో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు.

మండలంలో పురుషులు 9982, మహిళలు 10657 ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల గాను196 మంది పోలింగ్ ఆఫీసర్లు, 239 మంది పోలింగ్ సిబ్బంది మరో 100 మంది రిజర్వు సిబ్బందిని నియమించారు. ఒక డిఎస్ పి, ఒక సీఐ, నలుగురు ఎస్ఐలు, 7గురు ఏఎస్ఐలు, 10 హెడ్ కానిస్టేబుల్, 50 మంది పోలీస్ కానిస్టేబుల్, 23 హోంగార్డులు విధులు నిర్వహించనున్నారు.

పోలింగ్ కు కావలసిన సామగ్రిని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయా గ్రామ పంచాయతీలలోని పోలింగ్ బూతులకు(polling booths) కేటాయించిన సిబ్బందికి అందజేయగా పోలింగ్ సిబ్బంది ఆయా గ్రామాల పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. మండలంలో ఎన్నికలకు కావలసిన ఏర్పాట్లను మండల ప్రత్యేక అధికారి మోహన్ బాబు, ఎండిఓ సోమ సుందర్ రెడ్డి, తహసిల్దార్ సురగి సైదులు, ఎస్ ఐ రవీందర్, ఎంపీ ఓ నాగరాజులు పర్యవేక్షించారు.

Leave a Reply