Distribution | భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ

Distribution | ఊట్కూర్, ఆంధ్రప్రభ : మక్తల్- నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన బాధితులకు నారాయణపేట ఆర్డివో రామ్ చందర్ నాయక్, ఊట్కూర్ తాసిల్దార్ చింతా రవి శుక్రవారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.20 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేస్తున్నమన్నారు.

భూ సేకరణలో భాగంగా ఊట్కూర్ మండలంలో భూములు కోల్పోయిన ప్రతి రైతుకు ప్రభుత్వ పరంగా వచ్చే పరిహారం చెల్లించే విధంగా చూస్తామన్నారు. బాపూరు శివారు రైతులకు చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దార్ బాలరాజ్, తిప్రాసుపల్లి సర్పంచ్ విజయలక్ష్మి, ఆర్ ఐ వెంకటేష్, జిపిఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply