ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : వినాయక చవితి (Lord Vinayaka) సందర్భంగా హైదరాబాద్(Hyderabad) లోని వేలాది మండపాల్లో ప్రత్యేక పూజలు, భక్తుల రద్దీ కొనసాగుతోంది. కానీ ఈ వర్షం కారణంగా పూజా కార్యక్రమాలు అంతరాయం కలుగుతున్నాయి. నీరు నిలిచిపోవడం వల్ల భక్తులు దేవుడి దగ్గరికి చేరుకోవడం కష్టంగా మారింది. కొన్నిచోట్ల మండపాలు వరద నీటిలో మునిగిపోయాయి. వర్షపు బీభత్సం కారణంగా పండగ వాతావరణం భక్తులకు ఇబ్బంది కలిగిస్తోంది.
రాత్రి నుంచి…
హైదరాబాద్ నగరమంతా రాత్రి నుంచి వర్షం బీభత్సంగా కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షం (Rain) కారణంగా నగర వీధులన్నీ నీటితో నిండిపోతున్నాయి. వినాయక చవితి వేడుకలకు ఇది పెద్ద ఆటంకంగా మారింది. మండపాల వద్ద భక్తుల రాకపోకలు ఆగిపోవడం, రహదారుల(Roads)పై నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల విద్యుత్ అంతరాయం(power outage), మరి కొన్నిచోట్ల చెరువులా మారిన రోడ్లలో వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఆరెంజ్ అలర్ట్
వాతావరణ శాఖ (Weather Department) ఇప్పటికే హైదరాబాద్‌కి ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది. అంటే రాబోయే గంటల్లో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని స్పష్టంగా హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ అంటే.. సాధారణ వర్షం కాదని, తీవ్ర వర్షం, స్థానిక వరదల పరిస్థితి ఏర్పడే అవకాశమని అర్థం. అందుకే ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు