బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామకంపై చర్చ

  • రంగంలోకి ప్రత్యేక అధికారి
  • 28న అభిప్రాయాల సేకరణ
  • ధార్మిక పరిషత్కు నివేదిక సమర్పణ


( కడప, ఆంధ్రప్రభ బ్యూరో) : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామకంలో చర్యలు ప్రారంభమయ్యాయి. ధార్మిక పరిషత్ నియమించిన ప్రత్యేక అధికారి ఆజాద్ ఈ మేరకు ప్రకటించారు. బ్రహ్మంగారి పీఠాధిపతి నియామకం (Brahmangari Math Peethadhipathi Appointment) కోసం సంప్రదాయానికి చెందిన పీఠాధిపతులు, భక్తులు, శిష్యులు ఆశావహుల నుండి అభిప్రాయాలు, సలహాలను ప్రత్యేక అధికారి ఆజాద్ సేకరిస్తారు.

ఈనెల 28వ తేదీ 11 గంటలకు బ్రహ్మంగారి మఠంలో సమావేశం నిర్వహించనున్నట్లు చంద్రశేఖర్ ఆజాద్ (Chandrashekhar Azad) తెలిపారు. సమావేశానికి హాజరయ్యే వ్యక్తులు తమ అమూల్య సలహాలను సూచనలను ఆధారాలతో లిఖితపూర్వకంగా‌, మౌఖికంగా క్లుప్తంగా తెలియజేయాలని ఆజాద్ కోరారు. ఈ సమావేశంలో సూచనలు అభిప్రాయాలను ధార్మిక పరిషత్ కు ప్రత్యేక అధికారి సమర్పిస్తారు.

Leave a Reply