Narayanpet | క్రమశిక్షణ తప్పనిసరి

Narayanpet | క్రమశిక్షణ తప్పనిసరి

ఆర్ఐ నరసింహ


Narayanpet | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : క్రమశిక్షణ, సమయపాలన ప్రతి పోలీస్ విధుల్లో తప్పనిసరి అని ఆర్ఐ నరసింహ (RI Narasimha) అన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు నారాయణపేట పోలీస్ పరేడ్ మైదానంలో పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్ఐ నరసింహ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్ స్టేషన్ల నుండి మొత్తం 140మంది పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పరేడ్ (Parade)లో భాగంగా వెపన్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాటి డ్రిల్, ఆయుధాల వినియోగం, క్రమశిక్షణ, సమయపాలన వంటి అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. అపద సమయంలో పోలీసులు అనుసరించాల్సిన చర్యలు, విధుల గురించి సిబ్బందికి వివరంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. వీక్లీ పరేడ్‌లు పోలీస్ సిబ్బందిలో శారీరక ధారుడ్యాన్ని పెంచడమే కాకుండా నైపుణ్యాలు, క్రమశిక్షణను మరింత మెరుగుపరుస్తాయన్నారు.

ప్రజలకు అవసరమైన సమయంలో పోలీసుల సామర్థ్యాల (Police capabilities) ను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట సీఐ శివశంకర్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, రమేష్, విజయ్, రాజశేఖర్, అలాగే ఆర్ఎస్సైలు శివశంకర్, మద్దయ్య, శివశంకర్, శిరీష్, శ్వేతతో పాటు జిల్లాలోని పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply