Dilruba ట్రైలర్ రిలీజ్ !

విశ్వకరుణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘దిల్ రూబా’. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. మూవీ నుంచి పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశాయి.

ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో రొమాన్స్‌తో పాటు యాక్షన్ డోస్ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటుందని ఈ ట్రైలర్ ద్వారా వెల్లడించారు. కిరణ్ అబ్బవరం మరోసారి తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ సినిమాలో రుక్సర్ ధిల్లోన్, కేథి డేవిసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్య, దయానంద్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 14న ఈ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *