కుటుంబంతో క‌లిసి అమ్మవారికి ప్ర‌త్యేక పూజ‌లు

(బాసర, ఆంధ్రప్రభ) : ప్రముఖ నిర్మాత (A famous producer), తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ (Telangana Film Development Corporation) దిల్ రాజు (Dil Raju) దంపతులు శుక్రవారం శ్రీ జ్ఞాన సరస్వతి దేవి (Saraswathi Devi) అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న వీరిని ఆలయ అధికారులు, అర్చకులు సాద‌ర స్వాగతం పలికారు. అమ్మవారి చెంత దిల్ రాజు దంపతులు ప్రత్యేక కుంకుమార్చన జరిపించి హారతి ఇచ్చారు. అనంత‌రం దిల్ రాజును శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీరి వెంట ఆలయ సిబ్బంది అధికారులు ఉన్నారు.

Leave a Reply