
Digital Crime | క్లిక్ చేస్తే.. ఖాతా ఖాళీ..
Digital Crime | క్లిక్ చేస్తే.. ఖాతా ఖాళీ..
Digital Crime | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : సైబర్ క్రైమ్ నేరగాళ్లు క్రిస్మస్ గిఫ్ట్, న్యూఇయర్ గిఫ్ట్ అంటూ చేసే మోసాల బారిన ప్రజలు పడవద్దని ఎప్పటికప్పుడు మారుతున్న సమాజంలోని పరిస్థితులకు అనుగుణంగా సైబర్ నేరగాళ్లు వారి నేర విధానాన్ని మార్చుకుంటూ ప్రజలను (People) మోసం చేయడానికి కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారని జిల్లా ప్రజలు అప్రమతంగా ఉండాలని జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ శుక్రవారం మాట్లాడురు. పండుగ సీజన్ ప్రారంభమైన వెంటనే ఆన్‌లైన్ (Online) షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతమైన విక్రయాలు ప్రారంభం అవుతాయనన్నారు. కొంత మందికి క్రిస్మస్ గిఫ్ట్ అంటూ న్యూఇయర్ గిఫ్ట్ అంటూ వాట్సాప్ లేదా ఈ మెయిల్‌లో సందేశాలను లింక్ లు వస్తుంటాయని, ఆ లింక్ లను క్లిక్ చేసి మోసపోవద్దు అన్నారు. చిన్నగా $500 గిఫ్ట్ కార్డ్‌ను గెలుచుకోండని వస్తుంటాయని, ఆ లింక్ లపై క్లిక్ చేసిన తర్వాత దానితో ఓ లింక్ కూడా ఉంటుందని, దీనికి ఇచ్చే కాప్షన్ కూడా మిమ్ములను ఆ లింక్ క్లిక్ చేసే విధంగా పురిగొల్పుతుందన్నారు.
ఎటువంటి పరిస్థితిలలోను అపరిచితుల నుంచి వచ్చిన లింక్ లపై APK ఫైల్ క్లిక్ చేయవద్దన్నారు. అదే విధంగా మీ వ్యక్తిగత సమాచారం పాన్‌కార్డు నంబర్, పాన్‌కార్డ్ ఫోటోలు అపరిచిత లింక్ లలో పంచుకోవద్దు అన్నారు. మీ వ్యక్తిగత వివరాలు మీ ఫోన్ నంబర్ ఆధారంగా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఖాళీ అవుతాయని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఒకవేళ ఏదైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే సంబంధిత మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేయాలన్నారు. లేదా సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు, మీ దగ్గరలోని పోలీసు స్టేషన్ నంబర్ కు గాని కాల్ చెయ్యాలని, లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.
