- మీడిసెంటర్ కు రూమ్ కేటాయించని వైనం
- ఇబ్బందులు పడుతున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు
కాళేశ్వరం, మే 15(ఆంధ్రప్రభ): దక్షిణ అరణ్య శైవక్షేత్రంగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం వద్ద గురువారం నుండి ప్రారంభమైన పుష్కరాల సందర్బంగా.. సిఎం పర్యటన వార్తల కవరేజ్ కి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కష్టాలు తప్పడం లేదు. ఆలయ ఈవో, జిల్లా అధికారులు మీడియాపై చిన్నచూపు చూడడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని మీడియా మిత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సరస్వతి పుస్కారాలు 12 రోజుల పాటు విధులు నిర్వహించాల్సిన మీడియాపై ఇంత నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆలయం సమీపంలో మీడియా సెంటర్ ఏర్పాటు చేసి తగిన వసతులు కల్పించాల్సి ఉండగా అవేమి పట్టించుకోకుండా కేవలం సేవ భక్తులకు ఇచ్చిన రూమ్ కే మీడియా సెంటర్ అని బోర్డు తగిలించి అధికారులు చేతులు దులుపుకున్నారు. దీంతో కాళేశ్వరంకు వచ్చిన మీడియా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్, డీపీఆర్ ఓ వెంటనే స్పందించి మీడియా పాయింట్ ఏర్పాటు చేసి తగిన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనియెడల ఆందోళనలు చేపట్టేందుకు వెనుకాడమని హెచ్చరిస్తున్నారు.