వారంరోజులు ప్రయాణికులకు ఇబ్బందులు
వరంగల్ సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వే పరిధి డోర్నకల్-పావటపల్లి(Dornakal-Pavatapalli) మధ్య మూడోలైన్ మరమ్మతుల కారణంగా 32 రైళ్లను వారం రోజులపాటు అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని రీషెడ్యూల్ చేసింది. ఈ నెల 18 వరకు అమల్లో ఉంటాయని రైల్వే అధికా రులు తెలిపారు.
రద్దయిన వాటిలో డోర్నకల్-ఖాజీ పేట్, విజయవాడ -డోర్నకల్(Vijayawada-Dornakal) మెమో ప్యాసింజర్లు, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్సిటీ, విశాఖప ట్నం-న్యూఢిల్లీ స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్, ఏపీ ఎక్స్ ప్రెస్, పూరి-ఓకా ద్వారకా ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు ఉన్నాయి. ఆదిలాబాద్-తిరుపతి మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్(Krishna Express) ఈనెల 13, 16, 17 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా రీషెడ్యూల్ అయింది. విశాఖపట్నం-సి కింద్రాబాద్ వందేభారత్(Kindrabad Vandebharat), సికింద్రాబాద్-విశాఖ పట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు ఈ నెల 15,16,18 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా నడవనున్నాయి. సికింద్రాబాద్-గుంటూరు(Secunderabad-Guntur) మధ్య నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ 14 నుంచి 18 వరకు ఖాజీపేట్-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దయింది. ఈ రైలు సికింద్రాబాద్-కాజీపేట-సికింద్రాబాద్ మధ్య నడుస్తుంది.