Died | విద్యుత్ షాక్ తో రైతు మృతి

Died | నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : వ్యవసాయ పొలంలో వరి నారుమడికి నీరు పారించేందుకు వెళ్లిన రైతు కరంట్ షాక్ తగిలి మృతిచెందిన సంఘటన నాగిరెడ్డిపేటలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని లింగంపల్లి కలన్ గ్రామానికి చెందిన అల్లపురం లింగయ్య అనే వృద్ధుడు పొలం దగ్గర వరి నారుమడికి నీరు పారించేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు కరంట్ షాక్ తగిలి అక్కడికిక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య అల్లపురం లస్మవ్వ, కుమారుడు సురేష్ ఉన్నారు. ఈ మేరకు భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.

Leave a Reply