Dial your CMD | రేపు డయల్ యువర్ సీఎండీ

Dial your CMD | తిరుపతి, ఆంధ్ర‌ప్ర‌భ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను వివరించవచ్చన్నారు. సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సదవకాశాన్ని విద్యుత్తు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a Reply