సాంప్రదాయబద్ధంగా ఢూండ్ ఉత్సవాలు

సాంప్రదాయబద్ధంగా ఢూండ్ ఉత్సవాలు
లింగాపూర్, ఆంధ్రప్రభ: లింగాపూర్ మండల పరిధిలోని నడ్డంగూడా గ్రామంలో హోలీ పండగ కార్యక్రమంలో భాగంగా రాథోడ్ జలం సింగ్ కౌసల్యబాయి దంపతుల ఇంటి వద్ద రెండు రోజులపాటు బంజారాల సాంప్రదాయ పద్ధతిలో డూండ్ వేడుకలు ఘనంగా జరుపుకోనున్నారు. తెల్లవారుజామున కమాదానం చేశారు. భూమిలో రెండు వైపుల కోయలు పాతిపెట్టి రెండు బిందెలు పాయసం కడతారు.
గేరియాలు భూమిలో పాతిపెట్టిన కొయ్యలను తీసే క్రమంలో గేర్నిలు కొయ్యను తీయకుండా చిన్న కర్రలతో గేరియలకు కొడుతారు గేరియాలు ఉల్లాసంగా దెబ్బలు తింటారు. గేరియాలు గేర్ని దెబ్బల నుంచి రక్షించుకోవడానికి కర్రలను వాడుతారు. గేరియాలు కొయ్యలను తీసి. పాయసం తిని సంబరాలు చేసుకుంటారు. మండలంలోని పలు తండావాసులు, బంధువులు, మిత్రులు వచ్చి లేంగి పాట పాడి ఆలుపించి సందడి చేశారు

