Dharmapuri | తీగల ధర్మారాన్ని అభివృద్ధి చేస్తా..

Dharmapuri | ధర్మపురి, ఆంధ్రప్రభ : తీగల ధర్మారం గ్రామ సర్పంచ్ గా తనను గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తీగల ధర్మారం సర్పంచ్ అభ్యర్థి పందిరి అశోక్ తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామంలోని వివిధ వార్డులలో ప్రచారం చేశారు. తనకు మార్కెట్ కమిటీ డైరెక్టర్, ఉప సర్పంచ్ గా చేసిన అనుభవం ఉందని.. గ్రామానికి అత్యధిక నిధులు తీసుకోనివచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామి ఇచ్చారు. ప్రభుత్వం, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానని ప్రజలకు అన్నారు. ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
