ధర్మం – మర్మం : హనుమజ్జయంతి విశిష్టత (ఆడియోతో…)

చైత్రశుద్ధ పౌర్ణమినాడు వచ్చే హనుమజ్జయంతి యొక్క విశిష్టత, ఆచరించాల్సిన విధానం….

‘జన్మద్విధా’ అనగా పుట్టుక రెండు విధములు. తల్లి గర్భము నుంచి ఈ లోకములోకి వచ్చినపుడు మొదటి విధము, గురువు ఉపదేశం మొదలుపెట్టిన రోజు రెండవవిధము. నిజమైన జన్మ జ్ఞానజన్మ అని సిద్ధాంతము. అందుకే గురువు జన్మని, హితాన్ని, రక్షణను కల్పిస్తాడు కావున గురువే తల్లి, తండ్రి, దైవం . ప్రాచీన కాలంలో విద్యాభ్యాసం రోజున పుట్టిన రోజుగా పరిగణించి ఆచరించేవారు.

చైత్రశుద్ధ పౌర్ణమినాడు హనుమంతుడు సూర్యభగవానుని వద్ద విద్యాభ్యాసాన్ని ప్రారంభించిన రోజు కావున కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చైత్ర పూర్ణిమని హనుమజ్జయంతిగా ఆచరిస్తారు. కావున ఈ రోజు హనుమంతుడికి అత్యంత ప్రియమైన సింధూరాభిషేకం, సహస్రనామార్చన, తమాల పూజ(సంపెంగలతో పూజ), వడమాల, లవంగాలమాలలతో స్వామివారిని ఆరాధించాలి. వడపప్పు, పానకం, వెలగప ండు, అరటి పండు నైవేధ్యంగా సమర్పించాలి. పేదలకు అన్నదానం, వస్త్రదానం సామూహిక భజనలు జరుపుకోవాలి. ఇదేవిధంగా పూర్వాభాద్ర నక్షత్రం వైశాఖ బహుళ దశమి నాడు హనుమంతుడు అవతరించన రోజు కావున చాలా ప్రాంతాల్లో ఆనాడు కూడా హనుమజ్జయంతిని జరుపుకుంటారు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీల క్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *