ధర్మం – మర్మం : ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 15 (ఆడియోతో…)

భారతంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….

అన్యత్‌ పూర్ణాత్‌ అపాం కుంభాత్‌ అన్యత్‌ పాదావనే జనాత్‌
అన్యత్‌ కుశల సంప్రశ్నాత్‌ నచేచ్యతి జనార్ధనా

పూర్ణ జలకుంభంతో స్వాగతమును, పాదప్రక్షాళనమును, కుశల ప్రశ్నను తప్ప పరమాత్మ మరేదీ కోరడు.

లక్ష పుష్పార్చన, కోటి కుంకుమార్చన, సువర్ణ మణిరత్నాభరణములు ఇవన్నీ పరమాత్మకు లేవా? ఆడంబరాన్ని, ఐశ్వర్యాన్ని, అధికారాన్ని, ఆర్భాటాన్ని ప్రదర్శిస్తూ సమర్పించేవి ఏవీ పరమాత్మ స్వీకరించడు, ఆయనకు ఇవేమీ సంతోషాన్ని కలిగించవు. స్వామికి పూర్ణకుంభంతో స్వాగతం, పాదప్రక్షాళనము, స్వామి బాగుండాలన్న ఆకాంక్షతో కుశలమా స్వామీ అన్న ప్రశ్న ఈ మూడు విషయాలు తప్ప పరమాత్మ మరేవీ కోరడు.

రాయబారానికి వస్తున్న కృష్ణుడికి ఘనమైన స్వాగత సత్కారాలు చేసి అతడిని తమ వైపుకు తిప్పుకుందామని దుర్యోధనుని రాజకీయ మంత్రాంగం. కృష్ణ పరమాత్మకు పూర్ణకుంభ స్వాగతం, పాదప్రక్షాళనము, కుశల ప్రశ్న ఇవి మాత్రమే చాలని మరే ఆడంబరాలు వద్దని విదురుడు పలికెను. సత్కారం స్వచ్ఛమైన మనస్సుతో చేయాలి కాని మాసిన మనస్సుతో కాదు. భగవంతుడు భక్తిని చూస్తాడు కానీ భుక్తిని కాదు.

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *