Dhanalakshmi | ప్ర‌చారంలో దూసుకెళ్తున్న పాయం ధనలక్ష్మి

Dhanalakshmi | ప్ర‌చారంలో దూసుకెళ్తున్న పాయం ధనలక్ష్మి

టిడిపి, జనసేన, బిజెపి, టిఆర్ఎస్, సిపిఎం పార్టీలు బలపరిచిన అభ్యర్థి

Dhanalakshmi | అశ్వారావుపేట, ఆంధ్రప్రభ : టిఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి, సిపిఎం పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పాయం ధనలక్ష్మి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆఖరి సెకను వరకు కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించిన ధనలక్ష్మి అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ప్రధాన పార్టీలు మద్దతును కూడగట్టుకుని గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. గ్రామపంచాయతీలో విశేషమైన ఓటు బ్యాంకు ఉన్న టిఆర్ఎస్, టిడిపి, జనసేన, బిజెపి, సిపిఎంల నాయకుల మద్దతుతో పంచాయతీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వాడవాడలా తిరుగుతూ ఉంగరం గుర్తుపై పంచాయతీలోని ఓటర్లు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తద్వారా ఆసుపాక పంచాయతీని అన్ని రంగాలలో ప్రథమ స్థానంలో ఉంచుతానని పాయం ధనలక్ష్మి హామీ ఇస్తున్నారు.

స్థానికంగా మద్దతు ఇస్తున్న నాయకులను కలుపుకొని పంచాయతీ పరిధిలోని సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు తన శాయాశక్తులా కృషి చేస్తానని స్థానికులు తనకు మద్దతు ఇచ్చి సర్పంచిగా గెలిపించాలని ఆమె ఓటర్లను ప్రాధేయపడుతున్నారు. ఈ ప్రచారం కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే పలు ప్రధాన పార్టీలు పాయం ధనలక్ష్మికి మద్దతునిస్తుండటంతో ఆమె గెలుపు నల్లేరుపై నడకేనని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply