DGP Shivdhar Reddy | శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో..
- డీజీపీ శివధర్ రెడ్డి
- గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఈ ఏడాది నేరాల
- సంఖ్య 2.33 శాతం తగ్గింది
DGP Shivdhar Reddy | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఈ ఏడాది నేరాల సంఖ్య 2.33 శాతం తగ్గిందని వెల్లడించారు. వార్షిక నివేదిక-2025 విడుదల చేసిన సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivdhar Reddy) మాట్లాడుతూ… గతేడాది 2,34,158 కేసులు నమోదైతే.. 2025 సంవత్సరంలో 2.28,69 కేసులు నమోదయ్యాయని తెలిపారు. బీఎన్ఎస్ కేసులు 2024 లో 1,69,477 నమోదైతే 2025లో 1,67,018 కేసులు నమోదయ్యాయని, ఇవి గతేడాదితో పోలిస్తే 1.45శాతం తగ్గిందని తెలిపారు. నేర నిరూపణ శాతం – 3.09 శాతం పెరిగిందని, ఇది గతేడాది 35.63 శాతం ఉంటే ఈ ఏడాది 38.72 శాతం ఉందని తెలిపారు. ఈ ఏడాది నాలుగు కేసుల్లో మరణశిక్ష విధించబడిందన్నారు. 216 కేసుల్లో 320 మందికి యావజ్జీవ శిక్ష పడిందని చెప్పారు.
పోక్సో చట్టం కింద నమోదైన మొత్తం 141 కేసుల్లో ఈ ఏడాది కింద నమోదైన మొత్తం 141 కేసుల్లో 154 మంది నిందితులకు జీవిత ఖైదు విధించబడిందని, 3 కేసుల్లో నిందితులకు మరణ శిక్ష పడిందంని తెలిపారు. ఎస్సీ ఎస్టీ చట్టం 28 కేసుల్లో 53 మంది నిందితులకు జీవిత ఖైతు విధించబడిందని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలను (Election) ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు, మిస్ వరల్డ్ పోటీలు, ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ ప్రోగ్రామ్, వరదలు వంటి విపత్తులను ముఖ్యమైన ఈవెంట్లను తెలంగాణ పోలీస్ సమర్థవంతంగా నిర్వహించిందని చెప్పారు.
DGP Shivdhar Reddy | ఈ ఏడాది 509 మంది మావోయిస్టుల లొంగుబాటు:
ఈ ఏడాది 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని, అందులో 23మంది తెలంగాణకు చెందిన మావోయిస్టులు ఉన్నారని డీజీపీ వెల్లడించారు. సైబర్ క్రైమ్ విషయంలో రాష్ట్రంలో 3 శాతం తగ్గిందన్నారు. సైబర్ నేరాలు జాతీయ స్థాయిలో 41 శాతం పెరగగా తెలంగాణలో మాత్రం తగ్గాయన్నారు. ఫోన్ల రికవరీ విషయంలో దేశంలోనే తెలంగాణ (Telangana) ముందు వరుసలో ఉందని, రోజుకు సగటున 111 ఫోట్లు రికవరీ అవుతున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హత్యలు 8.76 శాతం తగ్గాయని, అత్యాచారాలు 13.45 శాతం, దోపీడీలు 27, దొంగతనాలు 9.1 శాతం తగ్గాయని డీజీపీ తెలిపారు. నమ్మక ద్రోహం కేసులు 23 శాతం పెరిగాయని వెల్లడించారు. వరకట్నం కోసం మహిళల హత్యలు 2 శాతం తగ్గాయని మహిళా భద్రత కోసం షీ టీంలు యాక్టివ్ పని చేస్తున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు 9.5 శాతం తగ్గగా సైబర్ క్రైమ్ కేసుల్లో రికవరీ 23 శాతం పెరిగిందని, ఈ ఏడాది రూ.246 కోట్లు రికవరీ చేశామన్నారు. 24,498 మంది బాధితులకు రూ. 159.65 కోట్లు రిఫండ్ కూడా చేశామన్నారు.
DGP Shivdhar Reddy | దేశంలో సత్తా చాటిన తెలంగాణ పోలీస్:
పోలీస్ శాఖలో కీలక పదవుల్లో మహిళా అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఈ ఏడాది వచ్చిన వరదలను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని గతంలో ఎప్పుడూ ఇలాంటి వరదలు నిజామాబాద్ లో రాలేదన్నారు. వరదల సమయంలో పోలీస్ సిబ్బంది (Police personnel) బాగా పని చేసి ప్రాణనష్టం లేకుండా చూశారన్నారు. రాష్ట్రంలో వివిధ కేసులను లోక్ అదాలత్ లో (Lok Adalat) పెద్ద సంఖ్యలో పరిష్కరించామని చెప్పారు. డ్యూటీ మీట్ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్లలో తెలంగాణ పోలీసులు తమ సత్తా చాటారని డీజీపీ వెల్లడించారు. జార్ఖండ్ లో నిర్వహించిన 68వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో తెలంగాణ పోలీసులు 18 పతకాలతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. ప్రపంచ పోలీస్ ఫైర్ గేమ్స్ లో తెలంగాణ పోలీసులు 10 పతకాలు సాధించారాన్నారు.

