Devotional | శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :మహా క్షేత్రమైన శ్రీశైలంలో నేడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ ఈవో శ్రీనివాసరావు, వేద పండితులు యోగ శాల లో ప్రవేశించి 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు.

ఉత్సవాలలో భాగంగా 20వ తేదిన పూజ కార్యక్రమం, ఇక 21న హంసవాహనసేవ, 22వ తేది మయూరవాహనసేవ, 23న పూజ కార్యక్రమాలు, 24న పుష్పపల్లకీ సేవ, 25వ తేది గజవాహన సేవ, 26న మహాశివరాత్రి సందర్బంగా ప్రభోత్సవం నందివాహనసేవ, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం – పాగాలంకరణ- స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం, 27వ తేది రథోత్సవం, తెప్పోత్సవం,28న యాగ పూర్ణాహుతి, ధ్వజావరోహణ, మార్చి 1న అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం కార్యక్రమాలను నిర్వహిస్తారు.

*పట్టువస్త్రాల సమర్పణ*

ఇక శ్రీశైల బ్రహోత్సవాలలో భాగంగా ఈ రోజు శ్రీకాళహస్తీశ్వరస్వామివార్ల దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఇక ఈనెల 20వ తేదిన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివార్ల దేవస్థానం తరుపున, 21న విజయవాడ ఇంద్రకీలద్రీశ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం, ఈనెల 22న ఉదయం కానిపాకం శ్రీవరసిద్ధివినాయకస్వామివార్ల దేవస్థానం తరుపున, సాయంకాలం – తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున పట్టవ స్త్రాలను స్వామి, అమ్మవార్లకు సమర్పించనున్నారు. ఇక 23వ తేది రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఇవ్వనున్నారు.

*చలువ పందిర్లు*:

శ్రీశైలంకు పెద్ద సంఖ్యలో భక్తులు రాకను దృష్టిలో పెట్టుకొని అవసరమైన ఏర్పాట్లను గావించారు. ఇందులో భాగంగా పలుచోట్ల భక్తులు సెదతీరేందుకు చలువ పందిర్లు వేశారు. దాదాపు 13 ఎకరాల విస్తీర్ణములో ఈ చలువపందిర్లు ఏర్పాటు- చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 19 నుండి 1వ తేది వరకు అన్ని ఆర్జిత సేవలు పరోక్షసేవలు దేవస్ధానం అధికారులు నిలిపివేశారు.

ఈ ఉత్సవ రోజులలో భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుంది. అయితే జ్యోతిర్ముడి కలిగియున్న శివదీక్షాభక్తులకు మాత్రం ఉత్సవాలలో అయిదు రోజులపాటు- అనగా 19 నుండి 23 వరకు నిర్ణీత వేళలలో శ్రీ స్వామివారి స్పర్శ దర్శనమునకు అవకాశం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.

ఉత్సవాలలో ఈనెల 23వ తేది రాత్రి గం.7.30 నుండి మార్చి 1 రాత్రి వరకు శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం పూర్తిగా నిలిపి వేయనున్నారు. ఇక ప్రముఖులకు ఉత్సవ రోజులలో 19 నుండి 1 వరకు విరామ దర్శన వేళలో మాత్రమే దర్శనం కల్పించనున్నారు. సర్వదర్శనం క్యూలైన్లలోని భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ విరామ దర్శనం ఏర్పాటుచేశారు. నాలుగు విడతలుగా వారికి అవకాశం ఉంటుంది. ఇందులో రెండువిడతలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మరో రెండు విడత కల్పించనున్నారు.

ఇక భక్తుల సౌకర్యార్థం మూడు క్యూలైన్లను ఏర్పాటు- చేయడం జరిగింది. ఉచితదర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం క్యూలైన్లు ఏర్పాటు- చేయడం గమనార్హం.ఉచితదర్శన క్యూలైను రథశాల నుంచి ప్రారంభమవుతుంది. రథశాల వద్ద నుంచి క్యూలైన్లలో ప్రవేశించిన ఉచిత సర్వదర్శనం భక్తులకు క్యూకాంప్లెక్స్‌ ద్వారా ఆలయ ప్రవేశం కల్పించబడుతుంది.

ఈ సర్వదర్శనం భక్తులకు క్యూ కాంప్లెక్స్‌ నందు వేచి వుండేందుకువీలుగా మొత్తం 17 కంపార్టుమెంట్లలో ఆయా ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. శీఘ్రదర్శనం (రుసుము రూ.200 లు) క్యూలైను క్యూకాంప్లెక్సు కుడివైపున (క్యాంటిన్‌ భవనం తొలగించిన చో) నుంచి ప్రారంభమవుతుంది. అతిశీఘ్రదర్శన క్యూలైన్‌ (రుసుము రూ.500) క్యాంపుకోర్టు భవనము నుండి ప్రారంభమవుతుంది.

వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లుల క్యూలైన్‌ ఉమరామాలింగేశ్వరస్వామి ఆలయం ముందు నుంచి ప్రారంబించనున్నారు.ఈ క్యూలైన్ల ద్వారా వచ్చే భక్తులు వేచివుండేందుకు క్యూకాంప్లెక్స్‌ నందు మొత్తం 8 కంపార్టుమెంట్లలో ఆయా ఏర్పాట్లు- చేశారు. క్యూకాంప్లెక్స్‌ లో వేచివుండే భక్తులకు నిరంతరం అల్పాహారం, బిస్కెట్లు-, మంచినీరు అందించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు

శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూలైన్‌ :ఇక శివదీక్షను స్వీకరించిన దీక్షాభక్తులను ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా దర్శనానికి అనుమతించనున్నారు. ఆలయ ఉత్తరభాగంలోగల చంద్రవతి కల్యాణమండపం నుంచి ఈ క్యూలైన్‌ ప్రారంభించనున్నారు..

శివదీక్షాభక్తులు దర్శనానికి వేచివుండే విధంగా చంద్రవతి కల్యాణమండపంలో మొత్తం 4 కంపార్టుమెంట్లు- ఏర్పాటు- చేశారు.

.*శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ*

శివదీక్షా, అర్థమండలశివదీక్షను స్వీకరించిన భక్తులు జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీమల్లికార్జునస్వామి స్వామివారికి జ్యోతిర్ముడి సమర్పించడం సంప్రదాయం. పాతాళగంగ రోడ్డుమార్గంలోని శివదీక్షా శిబిరాల వద్ద 19 నుండి మార్చి 5 వరకు జ్యోతిర్ముడి (ఇరుముడి) సమర్పించేందుకు ఏర్పాట్లు చేశారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం 35 లక్షల లడ్డుప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో మొత్తం 15 శాశ్వత కౌంటర్ల ద్వారా లడ్డుప్రసాదాలు అందజేస్తారు.వీటికి అదనంగా దేవస్థాన అన్నప్రసాద వితరణ భవనం వద్ద 4 తాత్కాలిక కౌంటర్లు,గణశ సదనం ఎదురుగా – 2 తాత్కాలిక కౌంటర్లు (అదనపు కౌంటర్లు),సి.ఆర్‌.ఓ కార్యాలయం వద్ద 2 తాత్కాలిక కౌంటర్లు (అదనపు కౌంటర్లు ఏర్పాటు- చేశారు.

*ఉచితంగా లడ్డు ప్రసాదాల వితర ణ*

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో నాలుగురోజులపాటు- 24 నుండి 27 వరకు భక్తులకు ఉచితంగా లడ్డుప్రసాదాలు అందజేస్తారు.ఒక్కోభక్తుడికి ఒక లడ్డు ఉచితంగా ఇవ్వనున్నారు. వీటితో పాటు భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాలలో 10 ఉచిత బస్సులు ఏర్పాటు- చేశారు. ఇక భక్తుల సౌకర్యార్థం నిరంతరం మంచినీటి సరఫరాకు ఏర్పాటు- చేశారు.రోజుకు 1,35,00,00 (30 లక్షల గ్యాలన్లు మంచినీరు సరఫరా చేయడం జరుగుతుంది. వీటిలో భాగంగా 30 నీటి స్టోరేజ్‌ ట్యాంకులు, క్షేత్రపరిధిలో పలుచోట్ల గల 34 ఆర్‌.ఓ ప్లాంట్లు-, 450 మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేశారు.*పాదయాత్ర భక్తులకు మంచినీటి సదుపాయం*వెంకటాపురం, నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను మెట్లమార్గం, -కై-లాసద్వారం, హాటకేశ్వరం, సాక్షిగణపతి మొదలైనచోట్ల మంచినీటిసదుపాయం కల్పించడం జరిగింది. *వాహానాల పార్కింగ్‌ ప్రదేశాలు*శ్రీశైలంకు భక్తుల రాకను దృష్టిలో పెట్టుకొని వాహానాలు బ్లాక్‌ కాకుండా ఎక్కడి కక్కడ మొత్తం 39 ఎకరాల విస్తీర్ణంలో 10 పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. జిల్లాపరిషత్‌ ఉన్నతపాఠశాల సమీపప్రాంతం, ఆగమ పాఠశాల ఎదురుగాగల ప్రదేశం, విభూతిమఠం సమీప ప్రాంతంలో, ఫిల్టర్‌ బెడ్‌, గణశసదనం ఎడమవైపు సెంట్రల్‌ పార్కింగ్‌ ప్రదేశం, వాసవీవిహార్‌ వద్ద, ఆర్‌.టీ-.సి. బస్టాండ్‌ వెనుక ప్రాంతం, హేమారెడ్డి మల్లమ్మ మందిరం, గురుసదన్‌. ఏనుగుల కట్ట ప్రదేశం తదితర చోట్ల వీటిని ఏర్పాటు చేయడం జరిగింది.

ఇక రింగురోడ్డు వద్ద ఏ.పీ.ఎస్‌. ఆర్‌.టి.సి, తెలంగాణ ఆర్‌.టి.సి. కర్ణాటక ఆర్‌.టి.సి బస్సులకు పార్కింగ్‌ ఏర్పాట్లు- చేశారు. అదేవిధంగా టూరిస్టు, కర్ణాటక బస్సు పార్కింగుకు ఎగువ ప్రదేశంలో పార్కింగు చేయబడ్డాయి.వీటితో పాటు- క్షేత్రపరిధిలో పలుచోట్ల తాత్కాలిక వైద్యశిబిరాలు కూడా ఏర్పాటు- చేశారు. ఇక భక్తులకు ఆలయసమీపంలోగల అన్నపూర్ణ భవనంలో అన్నప్రసాదాలను అందజేయనున్నారు.

పుణ్య స్నానాలకు ఏర్పాటు- :

పాతాళగంగ వద్ద భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు ఏర్పాట్లు- చేశారు.ఆలయ సమీపంలో (క్షత్రియ పత్రం దగ్గ) గంగాభవాని స్నానఘట్టాలలో కూడా భక్తులు స్నానాలాచరించవచ్చు. ఇవేకాక పలు ప్రదేశాలలో కూడా స్నానాలు చేసేందుకు సౌకర్యాలు కల్పించారు. మొత్తం 12 చోట్ల ఏర్పాట్లు- చేయబడ్డాయి.

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ :

మహాశివరాత్రి బ్రహోత్సవాలలో భాగంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడం పాటు ఆలయ పరిసర ప్రాంతాలు మొత్తం నిఘా నేత్రంలో ఉండనున్నాయి. ఇందులో భాగంగా వాటిని నిరంతరం పర్యవేక్షించేందుకు అన్నదాన భవనసముదాయం వద్ద కమాండ్‌ కంట్రోల్‌ రూములో కంట్రోలింగ్‌ పాయింట్‌ ఏర్పాటు- చేశారు.కంట్రోల్‌ రూములో 21 ఎల్‌. ఈ.డి టీ-వీలు అందుబాటు-లో ఉన్నాయి.20 పి.టి.జెడ్‌ కెమెరాలు, 2 పీపుల్స్‌ కౌటింగు కెమెరాలు, 553 స్టాటిక్‌ సి.సి. కెమెరాలు, 3 వెహికల్‌ నెంబర్‌ ప్లేట్‌ డి-టె-క్టివ్‌ కెమెరాలు ఏర్పాటు చేయడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *