Devotional | వైభవంగా వెంకటేశ్వర స్వామి శోభాయాత్ర
పెద్దపల్లి ఆంధ్రప్రభశ్రీ వేంకటేశ్వర స్వామి శోభాయాత్ర పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి అధ్యయనోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి కలువల క్యాంపు వద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి శోభాయాత్ర ప్రారంభమై కమాన్, జండా చౌరస్తా ల మీదుగా సాగింది. ఈనెల 13న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 22వ తేదీ వరకు కొనసాగుతున్నాయి.
ఆలయ కమిటీ శ్రీ వేంకటేశ్వర స్వామి ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన వాహనంపై ఊరేగించారు. శోభాయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో జిల్లా కేంద్రంలో సందడి నెలకొంది.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బొంకురి శంకర్, ఆలయ ప్రధాన అర్చకులు భాష్యం రంగాచార్యులు తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.